ఆక్రందన

Posted by నవజీవన్


ఆక్రందన 

ఒక ఆక్రందన 
ఒక ఆవేశం 
ఒక అవమాన భారం 
భరతమాత సిగ్గుపడాల్సిన రోజులివి 
భారతపౌరులు తల దించుకోవాల్సిన దినాలివి 
వావి వరసలు తెలియని మానవమృగాలు సంచరిస్తున్నాయి
వేటాడుతూ, వెంటాడుతూ అమాయక అతివలను కబళిస్తున్నాయి 
నిన్న నిర్భయ, నేడు  ఓ స్విస్ మహిళ 
కామదాహంతో విర్రవీగె ఈ నరరూపరక్షసులు 
దేశానికి శనిలా దాపరించారు 
దేశ ప్రతిష్టను మంటగలుపుతూ దిక్కు దిక్కునా విర్రవీగుతున్నారు 
ఏ రోజు ఏ వార్త విన్నా ఏదో ఒక అలజడి రగులుతున్న సమయమిది 
స్త్రీలపై అత్యాచారాలు శ్రుతి మించుతున్న తరుణమిది 
ఇలాంటి సంఘటనల వలన చిన్నబోతుంది మన భరతగడ్డ 
ప్రపంచ దేశాల ముందు కామోన్మాదులను పొషించే రక్తపుగడ్డగా 
ఇలాంటి దుశ్శాసనుల వలన అప్రతిష్టపాలవుతు ఉసూరుమంటుంది మన దేశం 
లేదా ఈ సమస్యకు పరిష్కారం 
సంస్కారం ఎరుగని కీచకులు సంస్కృతిని భ్రష్టుపట్టిస్తున్నారు 
మనోనిగ్రహం లెని మానసిక ఉన్మాదులు రెచ్చిపొతున్నారు 
మగువల మానాలకు రక్షణ కరువవుతుంది రొజు రొజునా 
పరాయి స్త్రీని మాతృమూర్తిగా, సొదరిగా, సహొదరిగా చూడని పైశాచిక శకం మొదలయ్యింది 
పాలకులారా !మేల్కొనండి 
మనుష్యులారా ! దయచేసి ఈ లోకం లో మనుష్యులుగా బ్రతకండి 

0 comments:

Post a Comment