కృషీవలుడు

Posted by నవజీవన్




కృషీవలుడు (కవిత)

ధరిత్రికే అమ్మ వంటిది
కృషివలుడి పంట చేను
కాయ కష్టం చేసి
విత్తనాలు నాటి
శ్రమైక జీవనం సాగించి
ఒక సూత్రధారిగా
ఒక సహన శీలిగా
ఒక తేజోమూర్తి గా వెలసిల్లి
అమ్మకే పెద్దన్న గా మారాడు
"రైతన్న"

కార్పొరేట్ పెత్తందార్లు
తన బ్రతుకు గూటి లోకి చొచ్చుకొస్తున్నా
అన్ని మర్మాలు తెలిసిన మనిషి కాబట్టి
నిస్సహాయత తో మౌనగీతాన్నే ఆలపిస్తున్నాడు
తన మనుగడకు ముప్పు వాటిల్లుతున్నా
తత్వవేత్త  మాదిరిగా
మౌనంగా తన సేద్యమేదో తను చేసుకుపోతున్నాడు

తన శక్తి కరిగి నీరవుతున్నా
మేరుపర్వతం వలె ఆశావహ దృక్పధం తో
నిరంతరం వ్యధా పూరిత జీవితాన్ని సాగిస్తూనే ఉన్నాడు
కర్షక శక్తి ఆనవాళ్ళు కనుమరుగైతే రాబోయే
వికృత పరిణామాల గురించి మనల్ని
అనుక్షణం  హెచ్చరిస్తూనే ఉన్నాడు.

0 comments:

Post a Comment