ఆత్మార్పణం

Posted by నవజీవన్


ఆత్మార్పణం (జూన్ 13, 2011 ) ఒక పర్యావరణ పరిరక్షకుడి కథ
జూన్ 13,2011


హెచ్.ఐ.హెచ్.టి ఆసుపత్రి, హరిద్వార్
భారతదేశం


36 సంవత్సరాల ఒక యువకుడు ఆ రోజు అంతిమ శ్వాస విడిచాడు.
కాని ఆ యువకుడి మరణం వెనుక ఒక భారత దేశ భవిష్యత్తు కార్యాచరణ దాగి ఉంది
ఆ యువకుడి పోరాటానికి ప్రచారం లేదు, స్వచంద్ధ సంస్థల మద్దతు కూడా పెద్దగా  లేదు
తన ఉద్యమానికి మద్దతుదారులను కూడగట్టుకొనే ఆర్ధిక స్థోమత కూడా అతనికి లేదు
కాని అతను ఉద్యమించాడు ..మరణించాడు
ఒక్క రోజు కాదు..115 రోజులు , నిరాహార దీక్ష చేసాడు






 గంగ నది ప్రాంతం లో రాజకీయ ప్రయోజనాల కోసం విపరీతంగా రాళ్ళను తవ్వి తరలించడాన్ని ఆయన వ్యతిరేకించారు. కుంభమేళ లో, గంగ నది తీరాలలో అక్రమంగా సాగిస్తున్న రాళ్ల తవ్వకాల మీద, క్రషర్ల మీద ధ్వజం ఎత్తి వ్యతిరేకతతో "పర్యావరణ పరిరక్షణ" కోసం ఫిబ్రవరి 19, 2011 తేదిన నిరాహార దీక్ష ప్రారంభించిన నిగమానంద జూన్ 13 వ తేదిన అంతిమ శ్వాస విడిచారు.


నిజం చెప్పాలంటే ఈ మధ్య కాలం లో పర్యావరణం కోసం నిరాహారదీక్ష చేసి ప్రాణాలు కోల్పోయిన ఏకైక వ్యక్తి  "నిగమానంద". కాని మనం వెతకవలసిన ప్రశ్నలు-నిగమానంద పోరాటానికి అంత మద్దతు దొరకపోవడానికి కారణం.


కేవలం అతనో సామాన్య మానవుడనా?


మరి అదే మద్దతు అవినీతి ని కేంద్రబిందువు చేసి పోరాటం చేసిన అన్న హజారే, బాబా రామ్ దేవ్ లకు దక్కింది.


నిజం చెప్పాలంటే నిగమానంద హిందూ ధర్మ మత విశ్వాసాలను క్షుణంగా అధ్యయనం చేసిన వ్యక్తి.
అందుకే హిందూ మత ధర్మాలకు ఆనవాలమైన గంగ నదీ పరీవాహక ప్రాంతాలలో అక్రమ వ్యాపారాలను అయన సహించలేదు.ఒక ఆధ్యాత్మికత నిండిన యువకుడిగా సాహసించి హరిద్వార్ మాతృ సదన్ లో దీక్ష చేపట్టారు.


కాని అయన దీక్ష కు ఏ సంఘాల  మద్దతు, సమితుల మద్దతు లభించలేదు.


ఒక సంకల్పం కోసం 115 రోజులు సాగించిన అతని అకుంటిత దీక్ష కాలగర్భం లో కలిసిపోయింది.


వనరుల పరిరక్షణ కోసం గళం ఎత్తిన ఓ యువకుడి ప్రస్థానం నిర్ధాంతరంగా ముగిసిపోయింది.


ప్రచారం లేకుండా, ఆర్భాటం లేకుండా గాంధేయ మార్గంలో సాగిన ఓ యువకుడి దీక్షకు  గుర్తింపే లేకుండా పోయింది.

0 comments:

Post a Comment